తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఏక్ మినీ కథ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత సంతోష్ శోభన్ ,  మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన  మంచి రోజులు వచ్చాయి మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో సంతోష్ శోభన్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా , ఫరియ అబ్దుల్లా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి "ఎమంటి నబయ్య"  అనే సాంగ్ ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు , అలాగే ఫుల్ సాంగ్ ను అక్టోబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.  మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: