
ప్రస్తుతం చిరంజీవి ఎక్కువగా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన చిత్రాల రీమేక్ పై దృష్టి సారించడం గమనార్హం. ఈ నేపథ్యంలోని ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు కూడా మలయాళం లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాల రీమేక్ లే కావడం గమనార్హం. త్వరలోనే చిరంజీవి నుంచి వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో తన కొడుకు కోసం కూడా చిరంజీవి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలో కడగపెట్టిన రామ్ చరణ్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత తన నటనలో మార్పులు చేసుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ కోసం చిరంజీవి భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బ్రో డాడీ సినిమాను మలయాళం నుంచి రీమేక్ చేసి తెలుగులో రామ్ చరణ్ చేత చేయించాలని చిరంజీవి ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.
మరి ఈ రీమేక్ సినిమాతో రామ్ చరణ్ సక్సెస్ పొందుతాడా లేదా అనేది తెలియాల్సి వుంది.