తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మూవీ లు తెలుగు లో కూడా డబ్ అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు తాజాగా విక్రమ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా నటించగా , సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో ఫ ఫజిల్ నటించగా , విజయ్ సేతుపతిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ తమిళ్ ,  తెలుగు  , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు తన తదుపరి మూవీ ని తలపతి విజయ్ తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లాంఛనంగా ఇప్పటికే ప్రారంభం కూడా అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తదుపరి మూవీ లకు సంబంధించిన అప్డేట్ తెలియజేశాడు. తళపతి విజయ్ తో తెరకెక్కిస్తున్న మూవీ పూర్తి కాగానే ఖైదీ సీక్వెల్ ను కార్తీ తో తెరకెక్కించ బోతున్నట్లు , ఆ తర్వాత విక్రమ్ కు సీక్వెల్ గా కమల హాసన్ తో ఒక మూవీ ని చేయనున్నట్లు , ఆ తర్వాత విక్రమ్ మూవీలో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య తో రోలెక్స్ పాత్రతో ఒక మూవీ చేయనున్నట్లు లోకేష్ కనకరాజు తాజాగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: