2009 వ సంవత్సరంలో వచ్చిన 'అవతార్' సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వేల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ.ఇక దానికి సీక్వెల్ గా 'అవతార్2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమా కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా నిన్న చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేసిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే వసూళ్లని కనుక గమనిస్తే..'అవతార్2' (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.


చాలా ఏరియాల్లో కూడా రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమా రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే రూ.13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ని సాధించింది. ఇంకా అప్పుడే రూ.7.75 కోట్ల లాభాలను కూడా అందించింది ఈ మూవీ. ఇండియాలో 41 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా అలాగే ప్రపంచవ్యాప్తంగా 500 మిలయన్ డాలర్ల వసూళ్లు సాధించినట్టు సమాచారం తెలుస్తుంది.అంటే దాదాపు 5 వేల కోట్ల దాకా వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా 2.2 బిలియన్ డాలర్లు వసూలు చెయ్యాలి. అంటే 16 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. మరి లాంగ్ రన్ లో అన్ని కోట్లు సాధిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: