ప్రముఖనిర్మాత దిల్ రాజ్ వివాదాలకు చాలదూరంగా ఉంటూ అందరి హీరోలతోనూ చాల సన్నిహితంగా ఉంటూ ఉంటాడు. ఈసాన్నిహిత్యం వల్లనే అతడు చాలతక్కువ సమయంలో ప్రముఖ నిర్మాతగా ఎదిగి ఇండస్ట్రీని శాసించే ఆనలుగురులో ఒకరిగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా దిల్ రాజ్ చేస్తున్న కామెంట్స్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు తావిస్తూ టాప్ హీరోల అభిమానులకు కూడ అతడి కామెంట్స్ అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 ఇప్పటికే దిల్ రాజ్ తాను తమిళ టాప్ హీరో విజయ్ తో తీసిన తమిళ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ చేసి చిరంజీవి బాలకృష్ణల సంక్రాంతి సినిమాలతో పోటీగా అతడు విడుదల చేస్తూ ఉండటంతో బాలయ్య చిరంజీవి అభిమానులు దిల్ రాజ్ పై గుర్రుగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దిల్ రాజ్ విడుదల చేస్తున్న ‘వారసుడు’ మూవీ వల్ల ‘వీరసింహా రెడ్డి’ ‘వాల్టేర్ వీరయ్య’ లకు తెలుగు రాష్ట్రాలలో అనేకచోట్ల ధియేటర్లు దొరకడం కష్టంగా మారింది అన్నమాటలు వినిపిస్తున్నాయి.

 

 ఇప్పుడు లేటెస్ట్ గా దిల్ రాజ్ చెన్నైలో జరిగిన విజయ్ ‘వారసుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులకు మరొకసారి తీవ్ర అసహనాన్ని కలిగించే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆఫంక్షన్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ తాను మొట్టమొదటిసారి హీరో విజయ్ ను కలవడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటను బయటపెట్టాడు.

 

 
తాను విజయ్ ఆఫీసు రూమ్ లో అతడి గురించి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు విజయ్ ఒక ట్రేలో రెండు కప్పుల కాఫీతో తన దగ్గరకు వచ్చి తానే స్వయంగా కప్పు కాఫీని తనకు అందించినప్పుడు విజయ్ సంస్కారానికి షాక్ అయ్యానని అంటూ దక్షిణాది సినిమా రంగంలో విజయ్ రియల్ సూపర్ స్టార్ అంటూ దిల్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులలో తీవ్ర అసహనానికి కారణమైనట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోలందరినీ ఆకాశంలోకి ఎత్తేసిన దిల్ రాజ్ ఇప్పుడు తన పార్టీని మార్చి విజయ్ ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: