ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న తమన్ చేతిలో ప్రస్తుతం అనేక క్రేజీ మూవీ లు ఉన్నాయి. తమన్ చేతిలో ప్రస్తుతం ఉన్న ఆ క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ సి 15 మూవీ కి ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్నాడు.


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 మూవీ కి ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటించనున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ జి మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.


పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్ర కని దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తమిళ మూవీ వినోదయ సీతం సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతుంది .


నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్ బి కే 108 మూవీ కి కూడా ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్నాడు.


రామ్ పోతినెని ... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇలా ప్రస్తుతం తమన్ వరుస క్రేజీ మూవీ లకు సంగీతం అందిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: