ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారు మొదట సైడ్ క్యారెక్టర్లు లేదా విలన్ రోల్స్ చేస్తూ హీరోలుగా మారిన వారే ఉన్నారు. ఇక అలాంటి వారిలో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విక్రమ్ కూడా ఒకరు అని చెప్పాలి. ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు విక్రమ్. అయితే కెరియర్ ప్రారంభంలో తమిళ సినిమాలతో పాటు నేరుగా తెలుగు సినిమాలను కూడా చేశాడు. అక్క పెత్తనం చెల్లి కాపురం, చిరునవ్వుల వరం ఇస్తావా, బంగారు కుటుంబం, ఆడాళ్ళ మజాకా, అక్క బాగున్నావా, మెరుపు, కుర్రాళ్ల మజాకా, యూత్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు విక్రమ్.



 ఇలా విక్రం నేరుగా తెలుగులో నటించిన సినిమాలలో అటు బంగారు కుటుంబం అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించారు. మిగిలిన సినిమాలు మాత్రం విక్రమ్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. శ్రీకాంత్ సతీమణి ఊహతోనే విక్రమ్ ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. విక్రమ్, ఊహ కాంబినేషన్లో వచ్చిన ఊహ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో విక్రమ్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమాలో  కమెడియన్ అలీ దాదాపు హీరో రేంజ్ ని పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమా మొత్తం అలీ, ఊహ, విక్రమ్ మధ్య సాగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ మళ్ళీ నెగటివ్ రోల్స్ లో కనిపించలేదు. ఇక ఇప్పుడు విక్రమ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.




 విక్రమ్ ఏ సినిమాలో నటించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు తన బాడిని అందుకు తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటాడు. ఇక మొన్నటికి మొన్న పోనియన్స్ సిల్వర్ 2 సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ali