ఈ నూతన శకంలో ఒక వ్యక్తి ధనవంతుడు గా మారాలి అంటే అతడి బుద్ధి మనస్తత్వం ఊహాశక్తి భవిష్యత్ మీద విశ్వాసాలు కీలక అంశాలుగా ప్రభావితం చేస్తాయి. చాలామంది డబ్బు విషయంలో ప్రధానమైన పొరపాటు చేస్తూ ఉంటారు. డబ్బును సంపాదించే ఆలోచనలు మన మనసులో ఉన్నా వాటిని లెక్కచేయకుండా డబ్బును గణించే మార్గాల కోసం అన్వేషణను సాగిస్తూ ఉంటారు.


ఖనిజాలు కావాలి అంటే ఆ ఖనిజాలు దొరికే గనుల దగ్గరకు వెళ్ళాలి కాని  మరొకచోట వెతికితే ఖనిజాలు ఎంత ప్రయత్నించినా లభించవు. అదేవిధంగా సంపద కూడ మనిషి అంతర ప్రపంచం నుండి లభిస్తుంది కానీ బయట ఎక్కడెక్కడో వెతికితే సంపద దొరకదు. అందుకే ఒక మనిషి మనసులో గూడు కట్టుకుని ఉన్న భావాలు తొలగించకుండా సంపన్నుడు కాలేడు అని అంటారు.


వాస్తవానికి డబ్బు సంపాదించడం ఎంత ముంఖ్యమో దాని నిలుపుకోవడం కూడ అంతే ముఖ్యం. వాస్తవానికి కొంతమంది చాల వేగంగా డబ్బు సంపాదించి అదేవేగంగా తాము సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా డబ్బును పోగొట్టుకునే వారు చెప్పే కారణాలు ‘దురదృష్టం తమను వెంటాడిందని వ్యాపార భాగస్వామి తనను మోసం చేసాడని ప్రకృతి సహకరించలేదని ఇలా అనేక కారణాలు చెపుతాడు’ కాని వాస్తవానికి తాను ఆ బిజినెస్ కు తన మేధాసంపత్తి సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచించుకోపోవడం వలనే వ్యాపారాలలో నష్టపోతు ఉంటారు.


వాస్తవానికి బాగా డబ్బు ఉన్నవారు కూడ వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు. అయితే చాలామంది తమకు ఉన్న సంపదను ఒకే వ్యాపారంలో పెట్టకుండా నాలుగు రకాల వ్యాపారాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందువల్ల ఒక వ్యాపారంలో నష్టం వచ్చినా మరొక వ్యాపారంలో లాభాలు వచ్చి ఆ నష్టాలు కవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా వ్యవహరించే వ్యక్తులు కూడ తమ అంతరంగంలో ఉన్న అనంత ఆలోచనల నిధిని నిరంతరం చైతన్య పరుచుకుంటూ మారుతున్న కాలానికి అభిరుచులకు అనుగుణంగా తమ వ్యాపారాలలో మార్పులు చేసుకుంటూ త్వరితగతిన సంపదను పొందుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: