వర్షాలు అనుకోకుండా సమయానికి కాకుండా ఎలా పడితే అలా వస్తూ ఉండడంతో రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు.ఇటీవలే తుఫాన్ చాలా నష్టాన్ని సైతం మిగిల్చిందని చెప్పవచ్చు దీంతో ఏపీ సీఎం జగన్ కోస్తా తీర ప్రాంతంలో విపరీతమైన వర్షం పడడంతో తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సైతం ఆదుకుంటామని తెలియజేశారు.. సచివాలయ, వాలంటరీ వ్యవస్థ వల్ల నష్టపోయిన వారిని తెలుసుకొని ఆదుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించినట్లు తెలుస్తోంది.

తుఫాను వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి అందుకు సంబంధించిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో కాసేపు మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్న ఏపీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపుకు గురైన గ్రామ ప్రజలకు రేషన్తో పాటు 2500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ వాటిపైన అపోహలు వద్దని తెలియజేశారు. పంట నష్టం పైన కలెక్టర్లు సైతం అంచనా వేసిన తరువాతే రైతుల ఖాతాలు డబ్బు జమ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.


చాలామంది కావాలని దుష్ప్రచారాలు సైతం చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది. తుఫాను కారణంగా 60 వేల కుటుంబాలు చాలా నష్టపోయాయని తెలియజేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టానికి సైతం ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుందని తెలియజేశారు గత ప్రభుత్వంలో వస్తుందో లేదో తెలియని ఇన్సూరెన్స్ కి ఈ ప్రభుత్వం మాత్రం రైతుల తరఫున ప్రభుత్వం ఇన్సూరెన్స్ ని చెల్లిస్తుందని తెలిపారు విత్తనాలను 80% సబ్సిడీలో రైతులకు అందించిన ఘనత తమ ప్రభుత్వాన్ని అంటూ ఏపీ సీఎం తెలియజేయడం జరిగింది. చేతికి వచ్చినటువంటి పంటను నష్టపోవడంతో పలువురు రైతులు సైతం చాలా  ఆందోళన పడుతూ ఉండగా ఏపీ సీఎం తెలియజేసిన ఈ మాటలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: