కొన్ని గంటల్లో ఆచార్య సినిమా మళ్ళీ షూటింగ్ జరుపుకుంటుంది అనుకున్న టైంకి చిరు కి కరోనా రావడం టాలీవుడ్ మొత్తానికి షాక్ ని ఇచ్చిందని చెప్పొచ్చు..కరోనా తగ్గుముఖం పట్టింది అని చకచకా సినిమాల షూట్ లు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ ఆరంభంలో మెల్లగా ప్రారంభమైన షూటింగ్ లు, సందడులు నవంబర్ మొదటి వారానికి పతాక స్థాయికి చేరాయి.ఇక థియేటర్లు పూర్తిగా ప్రారంభం అయితే చాలు టాలీవుడ్ మళ్లీ మామూలు అయినట్లే అని అందరూ అనుకుంటున్నవేళ 'మెగా' బాంబ్ పేలింది.ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ లో పలువురికి కరోనా పాజిటివ్ రావడం తో జాగ్రత్తగా షూటింగ్ లు చేసుకుంటున్నారు. ఆకోవలోనే ఎన్నో నిబంధనల మధ్య సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.