విలన్ నుంచి హీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో గోపీచంద్ మళ్ళీ పాత బాట పడుతున్నాడని ఓ వార్త టాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి.. గోపీచంద్ మళ్ళీ విలన్ గా కన్పించబోతున్నాడని తెలుస్తుంది..