నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సాయేశా సైగల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కు ముందు బాలకృష్ణ దాదాపు అరడజను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. దీంతో ఈ సినిమా పై అయన హోప్స్ పెట్టుకున్నారు. అటు బోయపాటి రికార్డు కూడా ఏమంత బాగాలేదు. అయన చేసిన వినయ విధేయ రామ ఫ్లాప్ తో అయన డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది..