గ్రేటర్ హైదరాబాద్ ఫలితం రాష్ట్రంలో ఒక్కసారిగా అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఈమధ్యనే జరిగిన ఈ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ లో ఉత్సాహం నెలకొని ఉంది.. అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా రావడం, అధికార పార్టీ ని నిలువరించడం చూస్తుంటే బీజేపీ కి ఇదే పెద్ద సక్సెస్ లా భావించి సంబరాలు చేసుకుంటుంది.. ఆ సంబరాలు ఇప్పటికీ ముగిసిపోలేదనంటే బీజేపీ పార్టీ ఈ విజయాన్ని ఎంతలా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలం చూస్తుంటే తెరాస పార్టీ కి ఓ వైపు భయం వేస్తుంది అని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది.