కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా, నిర్మాతగా అలీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ని సృష్టించాడని చెప్పొచ్చు.. చిన్నతనంలోనే యాక్టింగ్ లోకి వచ్చి మంచి మంచి పాత్ర లు పోషించి కామెడీ రారాజు గా ఎదిగాడు అలీ.. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ తన కామెడీ తో ప్రజలను అలరిస్తున్నాడు. నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నిర్మాతగా కూడా అయన ప్రేక్షకులను అలరించడం విశేషం.. ఇది చాలదన్నట్లు ఇటీవలే బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను కూడా ఆనందింపచేస్తున్నాడు.