ముకుంద సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస తెలుగు సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తొలి రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొంతకాలం నెట్టుకొచ్చింది.. అయితే అక్కడ చేదు అనుభవమే ఎదురవడంతో పూజా మళ్ళీ టాలీవుడ్ ని నమ్ముకుంది.. ఇక్కడ రీ ఎంట్రీ లో చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు డిమాండ్ ఎక్కువైపోయింది.. కుర్ర హీరోల దగ్గర్నుండి, సీనియర్ , స్టార్ హీరోల వరకు ఆమెతో నటించాలనుకునే వాళ్ళే..