వకీల్ సాబ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మగువా అనే పాట మాత్రమే విడుదల అయ్యింది. మరో పాటను వ్యాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ ఆ విషయాన్ని గురించి చిన్న హింట్ ఇచ్చాడు.ట్విట్టర్ లో ఫిబ్రవరి 14 అని లవ్ ఈమోజీ షేర్ చేశాడు. దాంతో వకీల్ సాబ్ నుండి వ్యాలెంటైన్ డే గిప్ట్ రాబోతున్నట్లుగా అందరు ఊహించేసుకుంటున్నారు.