మెగా వారి ఇంట్లో త్వరలోనే మరో పెళ్లి భాజా మోగనుంది. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం కాగా కొన్ని రోజులకే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. వరుస హిట్ లతో దూసుకుపోతున్న సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త వినగానే ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చినట్లయ్యింది. నిజానికి నిహారికనే సాయి తేజ్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు అప్పట్లో వచ్చాయి కానీ నిహారిక తనకు చెల్లెలు లాంటిది అని చెప్పడంతో ఆ రూమర్స్ ఆగిపోయాయి..