మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరాజయం లేని దర్శకుడు కొరటాల శివ.. రచయిత గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కొరటాల శివ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ స్టేటస్ కి చేరుకున్నాడు. తొలి సినిమా మిర్చి నుండి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు.. ప్రస్తుతం చేయబోతున్న ఆచార్య పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.. మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది.