ఆ తర్వాత దీనిపై విమర్శలు చెలరేగడంతో హారిక మేటర్ వివాదాస్పదం అయిపోయింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది.బృహస్పతి ఫౌండేషన్ ప్రతి ఏటా రైజింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇక, ఈ ఏడాదికి గానూ పలువురికి దీన్ని అందజేశారు. అందులో దేత్తడి హారిక ఒకరు. తాజాగా జరిగిన ఫంక్షన్లో ఆ అవార్డును అందుకుందామె. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో పాటు అఖిల్ సార్థక్ రైజింగ్ స్టార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.