టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం గురించి అందరికి తెలిసిందే. రిలీజ్ కి ముందు నుంచి ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. ట్రైలర్ తోనే ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రబ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా తోనే విజయ్ దేవరకొండ కి స్టార్ డమ్ వచ్చేసింది.. ఇటు డైరెక్టర్ కూడా ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా ని ఓ ట్రెండ్ సెట్టర్ గా చెప్తుంటారు. ఇప్పుడొచ్చే ఏ సినిమా కి అయినా అర్జున్ రెడ్డి సినిమా నే ఉదాహరణ గా చూపిస్తుంటారు.