నిన్న విడుదలైన ‘కాటమరాయుడు’ రిజల్ట్ పూర్తిగా బయటకు వచ్చింది. నిన్న ఉదయం పవన్ వీరాభిమానుల గందరగోళంతో అదిరిపోయిన దియేటర్లు అన్నీ నెమ్మదిగా సాయంత్రానికి తెరుకున్నాయి. దీనితో ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ వీరాభిమానులను మెప్పించే సినిమాగా మాత్రమే మిగిలి పోతుంది అన్న తీర్పును విమర్శకులు ఇస్తున్నారు. 

వాస్తవానికి వన్‌కళ్యాణ్‌ సినిమాలంటే ఒకప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేసేవిగా ఉండేవి. వరుస పరాజయాలతో పదకొండేళ్ల పాటు నానా పాట్లు పడ్డ పవన్ 'గబ్బర్‌సింగ్‌'తో మళ్లీ ఊపు అందుకున్నాడు. దీనితో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సరికి తన సినిమాలు అంటే అన్నీ మాస్ మసాలాతో గబ్బర్‌సింగ్‌ ఫార్ములాతో ఉంటే సరిపోతుంది అని నిశ్చ యించుకున్నట్లుగా కనిపిస్తోంది. 

తన ఫాన్స్ ని మెప్పించే అంశాలు ఉంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అన్న ఆలోచనలలోకి పవన్ వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. ఆ ఉద్దేశ్యంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నటించి తన ఇమేజ్ కొంత వరకు పాడుచేసుకున్నాడు పవన్. అయితే ఆ విషయాలు పవన్ లో మార్పు తీసుకు వచ్చినట్లు కనిపించడం లేదు అని విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. 

ఇదే సీన్ రిపీట్ చేస్తూ మాస్‌ ఎలిమెంట్స్‌, ఫైట్స్‌, ఇక తన మేనరిజమ్స్‌ వుంటే చాలని పవన్‌ ‘కాటమరాయుడు’ సినిమా చేసాడా ? అని అనిపిస్తోంది. ఏ సినిమాకైనా కథ, కథనం బాగుంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న ప్రాధమిక సూత్రాన్ని పవన్ మర్చిపోయాడా అని ఈ సినిమాను చూసిన విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం ఒక తమిళ రీమేక్ ను ఆధారంగా చేసుకుని ఎట్టి పరిస్తుతులలోను ఫెయిల్యూర్ రాకూడదు అన్న ఉద్దేశ్యంతో సేఫ్‌ గేమ్‌ ఆడాలి అన్న ఉద్దేశ్యంతో 'కాటమరాయుడు' సినిమాలో పవన్ నటించినట్లు ఉంది కానీ ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకు అన్ని విధాల నచ్చే సినిమాగా మారే అవకాసం లేదు అంటూ ఈ సినిమా పై ఫైనల్ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ‘కాటమరాయుడు’ పవన్ వీరాభినులకు మాత్రమే నచ్చే సినిమాగా మారడంతో ఈ సినిమా హడావిడి ఒక వారం రోజులు మించి ఉండదు అన్న కామెంట్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: