విప్లవ సినిమాల హీరో ఆర్. నారాయణ మూర్తికి అనుష్క, తమన్నా,నయనతారల పై కోపం వచ్చింది. ఆ కోపంతో మొత్తం హీరోయిన్స్ అందర్నీ కడిగేసాడు నారాయణ మూర్తి. ఇంతకీ ఆయన కోపం దేనిగురించి అని అనుకుంటున్నారా? సినిమా రంగం అంటే ఈ గ్లామరస్ భామలు లేదంటే టాప్ యంగ్ హీరోలు కాకుండా వేరెవ్వరూ కనిపించరా అంటు ప్రశ్నలు వేస్తున్నాడు నారాయణ మూర్తి.
సినిమాలు తీస్తే దియేటర్ల సమస్య కనీసం మంచి సినిమాలు తీసినా, మీడియా పట్టించుకోకపోవడం దారుణం అంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు ఈ విప్లవ హీరో. అదే పెద్ద హీరోలు లేదంటే పెద్ద హీరోయిన్స్ సినిమాలు చేస్తున్నా – చేయబోతున్నా – చేస్తారు అని అనుకుంటున్నా పెద్దపెద్ద ఫోటోలు పెట్టి తెగ రాతలు మీడియా కోడై కూస్తుందనీ చివరికి అనుష్క, తమన్నాల బొడ్డులు గురించి నడుము గురించి తెగరాతలు రాసే మీడియాకు తాను ఢిల్లీ అత్యాచార బాధితురాలు నిర్భయ గురించి తాను తీసిన ‘నిర్భయ భారతం’ సినిమా గురించి రెండు వాక్యాలు రాసే ఓపికా, తీరికా ప్రసారం చేసే శక్తి మీడియాకు లేదా అంటూ నిప్పులు చెరుగుతున్నాడు నారాయణ మూర్తి.
పూనమ్ పాండే బూతు ఫోటోల మైకంలో కొట్టుకు పోతున్న నేటి యువతరానికి, మీడియాకు నారాయణ మూర్తి మాటలు అరణ్య రోదన కాకుండా కనీసం ఒక్క శాతం అయినా సమాజంలో ఉన్న ప్రజలు మారితే ఎంతో బాగుంటుంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి