తెలుగు తెర మీద రియాలిటీ షోల లెక్క వేరేలా ఉండేది.. కాని అసలు సిసలు రియాలిటీ షో అనుభూతిని అందించేందుకు హింది బిగ్ బాస్ ను తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేశారు స్టార్ మా నిర్వాహకులు. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అది కూడా ఎన్.టి.ఆర్ చేశాడు కాబట్టి. తనలోని సెన్సాఫ్ హ్యూమర్ తో తారక్ బిగ్ బాస్ సీజన్ 1 అదరగొట్టాడు. 


ఇక లేటెస్ట్ సీజన్ అదేనండి సెకండ్ సీజన్ బిగ్ బాస్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. నాని మార్క్ గా సాగుతున్న బిగ్ బాస్ ఈ సీజన్ అనుకున్నంత రేంజ్ లో లేకున్నా బాగానే లాక్కొస్తున్నారు. గ్రాండ్ రియాలిటీ షో కాబట్టి ఆడియెన్స్ బాగానే ఫాలో అవుతున్నారు. అయితే సడెన్ గా బిగ్ బాస్ నుండి నాని బయటకు వచ్చేశాడని టాక్.


అదేంటి అంటే.. బిగ్ బాస్ రియాలిటీ షో చేసేదాకా బయట కనిపించకూడదు అన్నది ఒక రూల్. కాని నాని ఈరోజు ఆ రూల్ బ్రేక్ చేసి బిగ్ బాస్ లో కాకుండా ఓ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కనబడ్డాడు. అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గూఢచారి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నాని చేతుల మీదగా జరిగింది.    


ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాని బిగ్ బాస్ అయ్యేదాకా బయట ఫంక్షన్స్ కు అటెండ్ కాకూడదని అనుకున్నా అడివి శేష్ కోసం ఈ ట్రైలర్ రిలీజ్ కు వచ్చానని అన్నారు నాని. మీడియా ముందుకొస్తే బిగ్ బాస్ గురించి అడుగుతారని తెలుసు అందుకే ముందు ఈ ట్రైలర్ ఈవెంట్ గురించి మాత్రమే మాట్లాడి బిగ్ బాస్ గురించి నోరు విప్పలేదు నాని. 



మరింత సమాచారం తెలుసుకోండి: