కొంతకాలం క్రితం దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ గాసిప్పులు వచ్చాయి. ఆతరువాత కొంత కాలానికి ఆ గాసిప్పుల పై దేవిశ్రీ క్లారిటీ ఇచ్చాడు. ఆపై కొంత గ్యాప్ వచ్చిన తరువాత మళ్ళీ దేవిశ్రీ ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి. 

ఆమె ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టికి జోడీగా నటించిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. దీనితో ఈవార్తలు నిజం అనుకుంటూ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి జరిగింది. ఈమె ప్రస్తుతం చాల సినిమాలలో నటిస్తోంది. ఈమె నటించిన కొత్త చిత్రం ‘7’ ఈరోజు విడుదలైంది. 

ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె దేవిశ్రీతో తన పెళ్ళి విషయమై వచ్చిన వార్తల పై స్పందించింది. తనకు దేవిశ్రీతో పెళ్ళి కాబోతోంది అని వచ్చిన వార్తలను చూసి తాను షాక్ అయిన విషయాన్ని వివరిస్తూ వాస్తవానికి తాను ఇప్పటి వరకు ఎప్పుడు దేవిశ్రీని వ్యక్తిగతంగా కలసిన సందర్భాలు లేవు అన్నక్లారిటీ ఇచ్చింది.

వాస్తవానికి తనకు పరిచయమే లేని ఒక వ్యక్తితో తనను లింక్ చేస్తూ మీడియా వార్తలు రాయడం చూసి తాను షాక్ అయ్యానని అంటూ ఇలాంటి వార్తలు ఎవరు ఎందుకు వ్రాస్తారో తనకు అర్ధం కావడంలేదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఒక విధంగా ఇలాంటి వార్తలు వల్ల తను పాపులారిటీ వచ్చిందనీ జోక్ చేస్తూ మరోవిధంగా తన కెరియర్ కు మీడియా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు అని అంటోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: