సినిమాల మధ్య పోటీ పెరిగిపోవడంతో ఆసినిమాల ప్రమోషన్ కు విభిన్న మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘నిను వీడని నీడను నేను’ మూవీకి సంబంధించిన ప్రచారం పోస్టర్స్ భాగ్యనగరంలోని ఒక మల్టీ ప్లెక్స్ కు సంబంధించిన రెస్ట్ రూమ్స్ లో కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఇప్పటి వరకు సినిమాల పబ్లిసిటీకి సంబంధించి ప్రమోషన్ పత్రికలలో ఛానల్స్ లో కాలేజీలలో ఆఖరుకు జనం మధ్య రోడ్ల పై జరిగిన సందర్భాలు చూసారు కానీ ఏకంగా రెస్ట్ రూమ్స్ ను కూడ వదిలి పెట్టకుండా సినిమాల పబ్లిసిటీ ఏమిటి అంటూ విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.  సందీప్ కిషన్ సినిమాల కెరియర్ ఏమాత్రం బాగాలేని పరిస్థితి వాస్తవమే అయినా ఇలా ఇంత వికృతమైన పబ్లిసిటీ ఆలోచనలు ఈ సినిమా ఆలోచనలు ఎందుకు వచ్చాయి అంటూ విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి.  

ఇది ఇలా ఉంటే ఈమూవీ ట్రైలర్ చూసిన వారు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. సీరియస్ హారర్ సినిమాలు తగ్గిపోతున్న నేపథ్యంలో సరైన టైమ్ లో వస్తున్న మూవీగా ‘నిను వీడని నీడను నేనే’ మారుతుందా అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఈమూవీలో హీరో హీరోయిన్స్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగిన తరువాత కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. 

ఈమూవీ హీరో సందీప్ కిషన్ కు అద్దంలో తన బదులు మరో రూపం వెన్నెల కిషోర్ ది కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక అందరు షాక్ అవుతున్న పరిస్థుతులలో ఈ కేసును ట్రీట్ చేసే డాక్టర్ పరిశోధనలో సందీప్ కిషన్ ముఖంలో కనిపించే వెన్నెల కిషోర్ రూపం వెనుక ఒక విచిత్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తుంది. దర్శకుడు కార్తీక్ రాజు ఎంచుకున్న థీమ్ లో వెరైటీ కనిపిస్తున్న నేపధ్యంలో జూలైలో చాల సినిమాలు విడుదల అవుతున్నా ఆ విషయాలను పట్టించుకోకుండా సందీప్ కిషన్ తన సినిమాను జూలై రెండవ వారంలో చాల ధైర్యంగా ముందుకు తీసుకు రావడం హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: