రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా చేస్తున్న దొరసాని ట్రైలర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  ట్రైలర్ సూపర్ గా ఉండటంతో పాటు  శివాత్మిక హావభవాలు బాగున్నాయని టాక్ వచ్చింది.  దీంతో శివాత్మికాను సావిత్రితో పోలుస్తున్నారు.  ఇలా పోల్చడం ఎంతవరకు సమంజసం. 


మహానటి సావిత్రికి వచ్చిన పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం.  సౌందర్య కూడా చాలా ట్రై చేసినా ఆమెను అందుకోలేకపోయింది.  అలాంటి కేవలం ఫస్ట్ సినిమా, అందులోను సినిమా రిలీజ్ కాలేదు.  


భావాభావాలు బాగున్నాయని అన్నంత మాత్రమే ఏకంగా మహానటితో పోల్చడం ఏంటని అంటున్నారు.  కనీసం సినిమా రిలీజ్ అయ్యేవరకైనా ఆగి ఉంటె బాగుండేది కదా.  సినిమాలో ఆమె నటన ఎలా ఉందొ తెలియకుండా కేవలం ట్రైలర్ చూసి ఇలా పోల్చడం ఏమి బాగోలేదు.  


దొరసాని ఈనెల 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  1980 వ దశకంలో తెలంగాణాలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాను నిర్మించారు.  అప్పట్లో పెద్దింటి పిల్లలు ఎలా ఉండేవారు.  వారి జీవన విధానం ఎలా ఉండేది అనే విషయాలను ఈ మూవీలో చూపించినట్టు తెలుస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: