సెలబ్రిటి హోదా ఎంత వచ్చినా, పబ్లిక్ ప్రదేశాలలో తిరిగిటేప్పుటు మాత్రం మర్యాదగా నడుచుకోవాల్సిందే. ఎందుకంటే సెలబ్రిటిలు ఏ విధంగా నడుచుకుంటారో, వారిని అనుకరిస్తున్న అభిమానులు కూడ అదే విధంగా నడుచుకుంటారు. ఇరవై సంవత్సరాల పాప్ స్టార్ 'మిల్లిసైరస్' లేటెస్ట్గా లిక్కర్ బాటిల్‌తో పట్టుబడింది.
ఇదంతా యునైటెడ్ స్టేట్స్లో జరిగింది. యు.ఎస్‌లో లిక్కర్ తాగే వారి వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారై ఉండాలి. అలా కాకుండా వాళ్ళు లిక్కర్‌ను సేవిస్తూ పట్టుబడితే వాళ్ళు శిక్షార్యులు. ఓ నైట్ క్లబ్లో జరిగిన ఈవెంట్‌కు 'మిల్లిసైరస్' అటెండ్ అయ్యింది. అందులో మిల్లిసైరస్ లిక్కర్‌ను సేవించింది. తన చేతిలో ఓపెన్ చేసిన 'మాలిబు కోకోనట్ రమ్' లిక్కర్ బాటిల్ ఉన్న ఫోజ్ ఫొటోగ్రాఫర్స్‌కు చిక్కింది. దానికి సంబంధించిన వివరాలు బాహ్యప్రపంచానికి లేటుగా తెలిసాయి. 'మిల్లిసైరస్' లిక్కర్ తాగుతున్న ఫోటోలు నెట్లో పబ్లిష్ అయ్యాయి.
వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు 'మిల్లిసైరస్' మీద కేసును నమోదు చేసినట్టు లీడింగ్ టాబ్లాయిడ్ వివరించింది. రీసెంట్గా 'మిల్లిసైరస్' హాలోవీన్ సెలబ్రేషన్స్‌లో న్యూడ్ తరహా డ్రెస్సెలను వేసి అందరిని అవాక్కు చేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: