తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. గత వారం ఇంటి నుండి పునర్నవి వెళ్లిపోవడంతో ఇంటిలో పునర్నవి  తో గ్రూపు గా ఉన్న సభ్యులు బాగా కలవరపడటం జరిగింది. సీజన్ త్రి మొదలైన నాటి నుండి ఇంటిలో పునర్నవి, వరుణ్ సందేశ్, వీతిక మరియు రాహుల్ ఒక గ్రూపుగా ఉంటూ హౌస్ లో కలిసి మెలిసి ఉంటూ ఇప్పటివరకు రాణించడం జరిగింది. అయితే ఈ నలుగురు సభ్యులు పునర్నవి వెళ్లిపోవడంతో చాలా డల్ గా కామ్ అయిపోయిన మిగతా ముగ్గురు సోమవారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ట్రాలీ పార్కింగ్ గేమ్ లో ముగ్గురు ఎలిమినేషన్ కి నామినేషన్ అవ్వటం జరిగింది.


ఈ ప్రక్రియలో భాగంగా గత వారం వితిక‌ మెడల్ గెలుచుకోవడంతో...ఈ నామినేషన్ నుండి వితిక‌ తప్పించుకోవటం జరిగింది. అయితే బిగ్ బాస్ పెట్టిన ఈ టాస్క్ లో..గ్రూపు గా ఉన్న ఈ ముగ్గురు ఒకేసారి నామినేషన్ కి సెలెక్ట్ కావడంతో...కావాలనే ఒక గ్రూపుగా ఉంటూ మిగతా ఇంటి సభ్యులపై చేస్తున్న కామెంట్ లపై సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో తాజాగా జరిగిన ఈ టాస్క్ లో రాహుల్‌, బాబా భాస్కర్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను బాబా బ్యాచ్‌ టార్గెట్‌ చేసిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బాబా కావాల‌నే అంద‌ర్ని ఆపేసి శ్రీముఖి, శివ‌జ్యోతి వెళ్లేందుకు సాయం చేస్తున్నాడ‌ని రాహుల్ ఆరోపించాడు.


బాబా త‌న దారికి అడ్డుగా రావ‌డం వ‌ల్లే తాను కింద ప‌డ్డాన‌ని రాహుల్ వాపోయాడు. టాస్క్‌ మొదలైనప్పుడు తనకు అలీకి మధ్యన ఉన్న శివజ్యోతి.. మూడో రౌండ్‌ తర్వాత బాబావైపునకు ఎలా వెళ్లిందని ప్రశ్నించాడు. బాబా కావాలనే శివజ్యోతిని సేవ్‌ చేయాలని ప్లాన్‌ చేశాడని ఆరోపించాడు. అయితే ఈ క్రమంలో మా భాస్కర్ మాట్లాడుతూ ట్రాలీ స్ట్రైట్ గా వెళ్తుంది అది ఎలా తిరిగితే అలాగ వెళితే ఇది జరిగి ఉండేది కాదు కావాలని నేను తప్పు చేయలేదు నేను తినంగా టార్గెట్ పెట్టుకొని గేమ్ ఆడటం జరిగిందని...నేను వేసిన స్ట్రాటజీ ఏమీ లేదని బాబా భాస్కర్ రాహుల్ కి తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ చేసిన కామెంట్లు పై సోషల్ మీడియాలో నెటిజన్లు...ఓడిపోతే ఇలా మాట్లాడటం కామన్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: