ఇళయదళపతి విజయ్ గ్రేట్ ఫీట్ క్రియేట్ చేశాడు. యావరేజ్ టాక్ తో కోలీవుడ్ స్టార్ మరోసారి వందకోట్లు కొల్లగొట్టాడు. బరిలో ఎందరు ఉన్నా తన స్టార్ డమ్ కి తిరుగులేదని ప్రూవ్ చేశాడు. రీసెంట్ గా రిలీజైన విజిల్ మూవీ ఒరిజినల్ వెర్షన్ బిగిల్ తో తమిళనాట రికార్డ్స్ మోత మోగిస్తున్నాడు. 


తమిళ స్టార్ విజయ్ కోలీవుడ్ లో మరో సల్మాన్ ఖాన్ అయిపోయాడు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెట్టి ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని మాట్లాడుకుంటారు. ఇప్పుడు తమిళంలో కూడా విజయ్ సినిమాల గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. విజయ్ సినిమాకు హిట్ టాక్ వస్తుందా లేదా అనే విషయం అక్కడి సినీ ప్రియులు పట్టించుకోవడమే లేదు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తోందనేది పట్టించుకుంటున్నారు. 


తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న విజయ్ సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా.. అదిరిపోయే వసూళ్లు రాబట్టుతున్నాయి. రీసెంట్ గా తమిళంలో రిలీజైన బిగిల్ సినిమా మొదటి వారంలోనే 150కోట్లు పైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. లాంగ్ రన్ లో 250కోట్లు వసూలు చేస్తోందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా కార్తి ఖైదీ మూవీ కూడా రిలీజైంది. ఖైదీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. బిగిల్ కు యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా విజయ్ స్టార్ డమ్ తో సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టడం విశేషం. 


విజయ్ గత చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద ఇలాంటి మ్యాజిక్కే చేశాయి. థేరి, మెర్సిల్, సర్కార్ సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా వందకోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఇప్పుడు నాలుగోసారి విజయ్ అలాంటి గ్రేట్ ఫీట్ రిపీట్ చేశాడు. తెలుగులో విజయ్ గా డబ్ అయిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబట్టుతోంది. తెలుగు రైట్స్ ని 8కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 6కోట్లు వసూలు చేసిన విజిల్ పూర్తిగా రన్ అయ్యే లోపు మరో నాలుగు కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ తెలుగులో సైతం నెమ్మదిగా బలపడుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: