టాలీవుడ్ ఎంపరర్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరును ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పంచాయతీ ఓటర్ల జాబితా దేవీ లచ్చయ్య గా మార్చేసింది. లచ్చయ్య ఫోటో ఓటరు కార్డులో అతడి ఫోటో బదులు పవన్ కళ్యాణ్ ఫోటో దర్శన మిస్తోంది. ఈ పంచాయతీ పరిధిలోని నస్పూర్ కాలనీలో దేవి లచ్చయ్య ఓటరుగా ఉన్నాడు.
గతంలో నయనతార ఫోటోతో మన ఆంధ్రప్రదేశ్ లో ఓటరు కార్డులు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ మధ్య నస్పూర్ కార్యాలయంలో సిబ్బంది ఓటరు జాబితాలను పరిశీలిస్తుండగా ఈ విచిత్రం వెలుగులోకి వచ్చింది.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పవన్ రాజకీయాలలోకి వస్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అదే పవన్ ఫోటోతో మరో వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డులు రావడాన్ని బట్టి వచ్చే ఎన్నికలకు ప్రచారంగా ఎవరో పవన్ అభిమాని ఇలా మరొకరి ఓటరు కార్డు పై తన అభిమాన హీరో ఫోటోని పెట్టి అభిమానాన్ని చాటు కుంటున్నాడు అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి