యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ రాబట్టుకుంది. అయితే టాక్ డీసెంట్ గా ఉండడంతో మొదటి రోజు ఈచిత్రం మంచి ఓపెనింగ్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 1.65 కోట్ల షేర్ ను రాబట్టింది. మార్నింగ్ , మ్యాట్నీ షోస్ డల్ గా నడిచినా ఈవెనింగ్ , నైట్ షోస్
హౌస్ ఫుల్ కావడం తో ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ రోజు , రేపు కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.
ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మొదటి రోజు పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో పోటీలేకపోవడం కూడా ఈ
సినిమా కు కలిసి రానుంది. ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5కోట్ల వసూళ్లను రాబట్టాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఈ మార్క్ ను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'కనితన్' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన టియెన్ సంతోషే ఈ
రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయగా
రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ
సినిమా విడుదలచేసింది. ఫేక్
డిగ్రీ సర్టిఫికేట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు.