ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు  న‌టించిన చిత్రాల్లో 70శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయ‌నే చెప్పాలి. అతి కొద్ది శాతం మాత్ర‌మే హిట్ అయ్యాయి. అయినా స‌రే ప‌వ‌న్ రేంజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆ విష‌యం ప‌క్క‌న పెడితే అందులో రీమేక్ చిత్రాల‌న్నీ ఎక్కువ శాతం ఫ్లాప్ బాట ప‌ట్టాయి. వాటిలో గ‌బ్బ‌ర్‌సింగ్ అందుకు మిన‌హాయింప‌నే చెప్పాలి. తీన్మార్  ఫ్లాప్‌, పంజా ఫ్లాప్‌, గోపాలా గోపాలా ఫ్లాప్‌, కాట‌మ‌రాయుడు, ఇలా చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక పంజా సినిమా విష‌యానికి వ‌స్తే  ప్ర‌భాస్‌తో బిల్లా చిత్రం ద‌ర్శ‌క‌త్వం వహించిన డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్‌తో పంజా సినిమా చేశాడు కానీ అది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. 

 

 తీన్మార్ సినిమా హిందీలో పెద్ద హిట్ మూవీ కానీ ఇక్క‌డ ఫ్లాప్ అయింది. గోపాలా గోపాలా చిత్రం కూడా హిందీలో  పెద్ద హిట్  అక్క‌డ ప‌రేష్ రాహుల్ చాలా అద్భుతంగా న‌టించాడు. కానీ ఆ చిత్రం ఇక్క‌డ ఫ్లాప్ అయింది. అస‌లు థియేట‌ర్స్‌లోకి ఎప్పుడు వ‌చ్చింది ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవ‌రికీ తెలియ‌లేదు. ఇక త‌మిళ్‌లో సూప‌ర్ డూప‌ర్  హిట్ అయిన‌ కాట‌మ్‌రాయుడు కూడా తెలుగులో రీమేక్ చేసిన‌ప్పుడు మాత్రం ఫ్లాప్ అయింది. దీన్ని బ‌ట్టి ఆలోచిస్తే ప‌వ‌న్‌కి రీమేక్ క‌లిసి రాలేద‌నే చెప్పాలి. మ‌రి చివ‌రికి ఈ పింక్ ప‌రిస్థితి ఏమ‌వుద్దో వేచి చూడాలి.  ఇక దీనికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. కాబట్టి దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంట‌ద‌ని. స్టోరీకి పెద్ద పీట వేసే చిత్రాల‌నే తీస్తార‌నే టాక్ ఉంది. మ‌రి ఈ సినిమా ఏమ‌వుతుదో తెలియ‌దు గాని ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాల‌యితే మాత్రం బాగానే ఉన్నాయి. అలాగే ఇటీవ‌లె వ‌చ్చిన స‌మంత‌, శ‌ర్వానంద్ న‌టించిన రీమేక్ చిత్రం జాను పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 

 

అందులోనూ ప‌వ‌న్ ప్ర‌స్తుతం  రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నా సినిమాను 30 రోజులు మాత్ర‌మే కాల్ షీట్లు కేటాయించారు. ఇంత స‌మ‌యం కూడా కేటాయించ‌లేని ప‌రిస్థితుల్లో మ‌రి ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎంత మాత్రం హిట్ బాట ప‌ట్టిస్తారో వేచి చూడాలి.  ఇక అన్న‌వ‌రం  చిత్రం కూడా రీమేక్ అది కూడా ఫ్లాప్ అయింద‌నే చెప్పాలి. ఇక అలాగే మ‌రో విష‌యానికి వ‌స్తే సీనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అప్ప‌ట్లో రాజ‌కియాల‌కు వెళ్ళే ముందు మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమా చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న కూడా ఆ సినిమా కోసం 30 రోజులు మాత్రం కేటాయించార‌ట‌. కానీ ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ కూడా అదే బాట‌లో వెళుతున్నార‌ని చెప్పాలి. ప‌వ‌న్ ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: