తెలుగు ఇండస్ట్రీలో రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ మద్య విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘డిస్కోరాజా’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రవితేజ... డిఫరెంట్ కాన్సెప్ట్ తో డబుల్ రోల్ లో వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఆదరించలేకపోయారు. దాంతో ఈసారి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు రవితేజ. ఇదే సమయంలో గతంలో తనకు బలుపు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ చిత్రంలో బలుపు హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. 

 

గతంలో తనకు అచ్చి వచ్చిన పోలీస్ పాత్రలోనే నటిస్తున్నాడు రవితేజ. అంతే కాదు ఈ చిత్రం వాస్తవిక ఆధారాలను బట్టి తెరకెక్కిస్తున్నారట.  ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించింది.  తాజాగా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. గత కొంత కాలంగా వరలక్ష్మి నెగిటీవ్ పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.  ఈ రోజున వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు.

 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'క్రాక్' చిత్రంలో 'జయమ్మ'గా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్టులుక్ ను వదిలారు. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. ఈ రోజు వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు..ఇక పోస్టర్ లో ఈ అమ్మడు చాలా మాస్ లుక్ తో కనిపిస్తుంది. గత కొంత కాలంగా నెగిటీవ్ షేడ్స్ లో కనిపిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్  ఈ చిత్రంలో కూడా నెగిటీవ్ పాత్రలోనే కనిపిస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 8వ తేదీన ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: