చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి మహేష్ అంగీకరించిన తరువాత కూడ ఈ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. దీనితో ఈ ప్రాజెక్ట్ లో మహేష్ చేరిక వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది అంటూ చిరంజీవి సూచనతో మహేష్ ను పక్కకు పెట్టారు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి మొదలైంది. 


అయితే అసలు విషయం వేరు అని అంటున్నారు. చిరంజీవి మహేష్ ల కాంబినేషన్ ‘ఆర్ ఆర్ ఆర్’ క్రేజ్ ను తగ్గిస్తుంది అన్న అభిప్రాయంలో రాజమౌళి ఉన్నాడట. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడటానికి చరణ్ జూనియర్ ల కాంబినేషన్ కూడ ఒక ప్రధాన కారణం. 


ఇప్పుడు ‘ఆచార్య’ మూవీలో చిరంజీవితో మహేష్ కలిసి నటిస్తే ఆ మూవీ మ్యానియా ఇంచుమించు ‘ఆర్ ఆర్ ఆర్’ స్థాయికి చేరిపోతుందని దీని తరువాత కొన్ని నెలల గ్యాప్ లో వచ్చే చరణ్ జూనియర్ లు కలిసి నటిస్తున్నా ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ సర్వసాధారణమే అన్న ఫీలింగ్ ఏర్పడుతుందని రాజమౌళి భయపడినట్లు టాక్. దీనికితోడు మహేష్ చిరంజీవి కలిసి నటించినా ‘ఆచార్య’ కు భారీ రికార్డులు రాకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ చరణ్ జూనియర్ లు కలిసి నటించినా అటువంటి పరిస్థితి వస్తుంది కదా అంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్ల దగ్గర నుండి ప్రశ్నలు వచ్చే ప్రమాదం ఉంది అన్న భయాలు కూడా రాజమౌళికి ఉన్నట్లు తెలుస్తోంది.


దీనితో రాజమౌళి తన భయాలు అన్నీ చరణ్ తో వివరంగా చెప్పడంతో ‘ఆచార్య’ మూవీలో మహేష్ ప్రత్యేక పాత్ర సస్పెన్స్ లో పడింది అని అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ‘ఆచార్య’ మూవీని వేగంగా పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలి అన్న పట్టుదలతో ఉన్న పరిస్థితులలో ఈ సున్నిత సమస్యను ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలతో కొరటాల చిరంజీవి మధన పడుతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: