చిత్రపరిశ్రమలో ఎఫైర్లు గురించి వార్తలు లేకుండా రోజు గడవదు. బాలీవుడ్ లో అయితే ఈ సంస్క్రుతి మరీ ఎక్కువ తోటి నటులతో, దర్శకులతో హీరోయిన్లు క్లోజ్‌గా వుండడంతో రకరకాల వార్తలు వింటూనే వుంటాం. ఆ మధ్య మిల్కీ బ్యూటీ తమన్నాపై కూడా అలాంటి ప్రచారమే జరిగింది. దీనితో చివరకు ఆ దర్శకుడు రంగంలోకి దిగి తనకు తమన్నా చెల్లెలులాంటిదని క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది. గత సంవత్సరం తమన్నా ఎన్నో అసలు పెట్టుకుని చేసిన సినిమ ‘హిమ్మత్‌వాలా’. ఈ సినిమా పరాజయం చెందినా దర్శకుడు సాజిద్‌ఖాన్‌ - మిల్కీబ్యూటీకి మధ్య ఎఫైర్ వుందంటూ బాలీవుడ్‌లో తెగ వార్తలు వచ్చాయి.. మరొక బాలీవుడ్ పత్రిక అయితే ముంబాయ్ లోని ఒక పెద్ద భవంతికి చెందిన లిఫ్ట్ లో వీరి ముద్దుల సీన్స్ జరిగిపోయాయి అని కూడ వార్తలు వచ్చాయి. ఇక ఈ బాధ పడలేక అనుకోవాలి ఈ సినిమా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చుకోవాల్సివచ్చింది. మీడియా అనుకున్నట్లు తమన్నాతో అలాంటి సంబంధమేదీ లేదని, ఆమె తనకు చెల్లెలు లాంటిదంటూ చెప్పుకొచ్చాడు. ఈ తరహా వార్తలు చూసి తనకు నవ్వు వస్తుందని కూడ వివరణ ఇచ్చాడు.  మరొక ట్విస్ట్ ఏమిటంటే తమన్నా.. తనకు రాఖీ కట్టిన చెల్లెలని బాంబు పేల్చాడు. ఇది ఇలా ఉండగా తమన్నా కూడ ఈ వ్యవహారం పై మరోవైపు స్పందించింది. ‘హిమ్మత్‌వాలా’ షూటింగ్ సమయంలో సాజిద్‌కు తను రాఖీ కట్టింది ముమ్మాటికీ నిజమేనని అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ అన్నా చెల్లెలు పై రకరకాల కధలు ప్రచారంలో వస్తూనే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: