నయనతార, విఘ్నేష్ శివన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఈ లవ్ బర్డ్స్ అండర్ స్టాండింగ్ కి నెటిజన్లు సర్ ప్రైజ్ అవుతున్నారు. అన్ అఫీషియల్ భార్యాభర్తల్లా బిహేవ్ చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఇంకెన్నాళ్లు కలిసి తిరుగుతారు. పైగా ఇద్దరూ థర్టీ క్రాస్ చేశారు, ఇంక పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు కూడా ఇస్తున్నారు.
నయనతార, విఘ్నేష్ శివన్ అయిదేళ్ల నుంచి లవ్ లో ఉన్నారు. ‘నానుమ్ రౌడీ ధాన్’టైమ్ లో వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి హాలిడే ట్రిప్పులు, ఫారెన్ ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. అయితే రిలేషన్ ని పబ్లిక్ గా రివీల్ చేసినా, పెళ్లి గురించి మాత్రం మాట్లాడట్లేదు ఈ లవ్ బర్డ్స్. ఇక రీసెంట్ గా ఓనం సెలబ్రేషన్స్ కోసం నయనతార ఇంటికి కొత్త అల్లుడిలా వెళ్లాడు విఘ్నేష్. ఇక ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగానే నెటిజన్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారా ఏంటని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వీళ్లిద్దరు పెళ్లిచేసుకోకపోతే నయన్ ఫ్యామిలీ విఘ్నేష్ తో ఇంత క్లోజ్ గా ఎలా ఉంటుంది.. అంత అండర్ స్టాండింగ్ ఎలా ఉంటుంది.. కెరీర్ కోసం నయన్ పెళ్లి గురించి ఓపెన్ కావడం లేదేమో అని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనికి నయన్, విఘ్నేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మొత్తానికి నయనతార, విఘ్నేశ్ శివన్ తీరు చూస్తుంటే కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. పెళ్లయిన కొత్తజంటలా కనిపిస్తుండటంతో రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు చూసినవాళ్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి