మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా మగధీర. భారీ ఖర్చుతో అప్పట్లో మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు హీరోగా చరణ్ కు మంచి బ్రేక్ అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగి మధ్యలో ఎన్నో మంచి విజయాలు అందుకున్నారు చరణ్. ఇటీవల క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో మరొక భారీ బ్లాక్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.  

తొలిసారిగా నందమూరి నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు చరణ్. తొలిసారిగా తన తండ్రి చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన చరణ్ ఆ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇటీవల తండ్రితోనే మరొకసారి ఆయన నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నిర్మిస్తున్న చరణ్, అతి త్వరలో వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించనున్న లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ ని కూడా నిర్మించబోతున్నారు. ఇక మొదటి నుంచి కూడా చరణ్ కు నిర్మాతగా తాను నిర్మించే సినిమాల గురించి ఎంతో దూర దృష్టి ఉంటుందని ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాల్లో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుందని, వాటి గురించి చరణ్ మంచి అవగాహన కలిగిన వ్యక్తి అని, కాగా ఇటువంటి విషయాల్లో తండ్రినే మించిపోయిన చరణ్ రాబోయే రోజుల్లో మరింత గొప్ప క్రేజ్ ని దక్కించుకోవడం ఖాయమని పలువురు మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: