ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ  అనన్య పాండే తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెల్లగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటూ వరుస అవకాశాలు పట్టేస్తుంది. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ నుంచి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ చేస్తోంది.ఇప్పటికే చాలామంది తారలు బీ టౌన్ నుంచి వచ్చి తెలుగు తెరపై సందడి చేయగా.. విజయ్ దేవరకొండ హీరోగా రానున్న 'ఫైటర్' మూవీతో ఈ హాట్  బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్న అనన్య.. 'ఫైటర్' మూవీలో భాగం కావడం పట్ల ఆసక్తికరంగా రియాక్ట్ అయింది.


తాజాగా ఒక  ఇంటర్వ్యూలో ఈ హాట్ అండ్ యంగ్  బ్యూటీ అనన్య పాండే  తన రాబోయే ఇంకా చెయ్యబోయే  సినిమాలపై ఈ విధంగా స్పందించింది.. తదుపరి చేస్తున్న సినిమాల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఈ హాట్ బ్యూటీ తన సంతోషాన్ని తెలిపింది. విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ఫైటర్ షూటింగ్ ఓ మరపురాని ఇంకా ఎంతో విభిన్నమైన ప్రపంచం అని, అక్కడ చాలా నేర్చుకున్నానని తెలిపింది. అలాగే దీపికా పదుకొణె, సిద్దార్థ్‌ చతుర్వేది కీలకపాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాలో భాగం అయ్యి నటిస్తుండటం చాలా  సంతోషంగా ఉందని.. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌ బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: