తెలుగులో టాప్ దర్శకుల జాబితాలో తాజాగా చేరిన పేరు నాగ్ అశ్విన్. 'మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. తర్వాతి ప్రాజెక్టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలుసు కదా. ఇది ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తారని సమాచారం. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తారని చెప్పారు. 'రాధే శ్యామ్' మూవీ తర్వాత ప్రభాస్.. వెంటనే నాగ్ అశ్విన్ తో సినిమా మొదలు పెడతారని అందరూ భావించారు. అయితే అదే సమయంలో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్' ప్రకటించారు. దీంతో మరి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఏమైంది? అనే అనుమానాలు తలెత్తాయి.

అదే సమయంలో ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 'సలార్' అనే పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండదని.. అసలు ఉండకపోవచ్చని వార్తలు వినిపించడం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా నాగ్ అశ్విన్ స్పందించాడు. ప్రభాస్ తో చేయబోయే సినిమాపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. 'ప్రభాస్ సినిమా నుంచి న్యూ ఇయర్ లేదా పొంగల్ కి అప్డేట్ ఉందా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. 'పొంగల్ తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుంది.. ప్రస్తుతం వర్క్ ఫుల్ ఫ్లో లో నడుస్తోంది' అని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: