ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  "బాహుబలి" సృష్టించిన అలజడితో సౌత్ నుంచి సినిమాలు వస్తున్నయంటే బాలీవుడ్ బాక్సాఫీస్ వణికిపోతుంది. ముఖ్యంగా అక్కడ స్టార్ హీరోలు సైతం ఈ సినిమాలు విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని మరీ వాళ్ల సినిమాల విడుదల తేదీని చేస్తున్నారు. అంతేకాదు, స్టార్ హీరోలు అనుకున్నవాళ్ల మార్కెట్ కూడా ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోల మార్కెట్ కి సమానం  అయిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ సాహో సినిమా తర్వాత తెలుగు సినిమాల స్వరూపమే మారిపోయింది. సినిమా పరంగా ఫలితం సరిగ్గా రాకపోయినా బాలీవుడ్ లో మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ నే క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే, ఇప్పుడు ఈసారి కూడా ముఖ్యంగా నాలుగు సినిమాలు షేక్ చేయబోతున్నాయి.

రాకింగ్ స్టార్ యష్ నటించిన "కేజీఎఫ్ చాప్టర్ 2" సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బాలీవుడ్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది. ఒకవేళ మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా కలక్షన్స్ పరంగా మాత్రం దుమ్మురేపడం గ్యారెంటీ. కన్నడ ఇండస్ట్రీ చేసిన ఈ కేజీఎఫ్ మాయ బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్ ఇలా బాలీవుడ్ స్టార్స్ ఉండటం అనేది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. సినిమా పరంగా ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా ఒక్క హిందీలోనే సినిమా 500కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. కేజీఎఫ్ సినిమా పక్కనబెడితే,

తరువాత ఈ సంవత్సరం రాబోతున్న రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" సినిమాకి కూడా విపరీతమైన క్రేజ్ వుంది. ఇందులో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేయడం ఒక ఎత్తు అయితే, బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగన్, అలియాభట్ ఉండటం కూడా బాలీవుడ్ లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ ని తెచ్చిపెడతాయి. సో, రాజమౌళి సినిమా ఈసారి కూడా బాలీవుడ్ ని షేక్ చేయడం పక్కాగానే కనిపిస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకూ స్టామినా ఉంది ఈ సినిమాకి.

ఇక "సాహో" తరువాత  "రాధేశ్యామ్" అంటూ ప్రభాస్ వస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్ లో చూపించే సినిమా ఇది. ఏమాత్రం లవ్ స్టోరీ బాలీవుడ్ బ్రదర్స్ కి కనెక్ట్ అయినా పక్కా హిట్ గ్యారెంటీ. అందులోనూ ప్రభాస్ కి బాలీవుడ్ లో స్టాండెట్ మార్కెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా భారీగానే ఓపెనింగ్స్ ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమా మాత్రం ఖచ్చితంగా వసూళ్ల పరంగా హిట్ అవుతుంది. ఇక ఈ సినిమాలను చూసి బాలీవుడ్ వణికిపోతుంది.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: