ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ మూవీ తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, ఒలీవియా మోరిస్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కించనున్నారు.

అయితే రాజమౌళి ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అనగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీనితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిర్మాతగా వ్యవహరించిన మైదాన్ సినిమా కూడా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన విడుదల కానున్నది. నిజానికి 6 నెలల క్రితమే మైదాన్ సినిమా రిలీజ్ డేట్ ని బోనీ కపూర్ ఫిక్స్ చేశారు. అయితే రాజమౌళి సరిగ్గా ఆ డేట్ కి 2 రోజుల ముందే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రకటించడంతో ప్రస్తుతం బోనీకపూర్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

కరోనా తో మూవీ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలమైన నేపథ్యంలో ఒకరికి ఒకరు సహకారం అందించుకోవాలని కానీ ఒకే సమయంలో సినిమాలు విడుదల చేసి నష్టం వాటిల్లేలాగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా సినిమా రిలీజ్ విషయంలో రాజమౌళి ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఇకపోతే మైదాన్ అనేది మూవీ ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవత కథ ఆధారంగా రూపొందించబడినది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో కూడా అజయ్ దేవగన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు 2 రోజుల కాలవ్యవధితో విడుదలయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోని కపూర్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: