సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలను అస్సలు మర్చిపోలేము . చాలా మంది స్టార్ హీరో,హీరోయిన్లు తమ సినిమాలలో నిజమైన భార్య భర్తలు గా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.  అయితే ఏ జంటలు టాలీవుడ్ లో ప్రేక్షకులను మెప్పించాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


వెంకటేష్  - మీనా :
సినీ ఇండస్ట్రీలో ఈ జోడి గురించి చర్చించుకోని వారంటూ ఎవరూ ఉండరు.  నిజమైన భార్యాభర్తలుగా,అంత ఆకట్టుకునేలా సినిమాలలో నటిస్తూ ఉంటారు. 1990 ప్రారంభంలో వీరి జోడీకి మంచి డిమాండ్ కూడా ఉండేది. ఇక చంటి సినిమా ద్వారా ఈ జోడికి తమిళనాడులో కూడా బాగా డిమాండ్ పెరిగింది. అలా చంటి,సుందరకాండ, అబ్బాయిగారు,సూర్యవంశం, దృశ్యం  వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు..

బాలకృష్ణ - శ్రేయ :
వీరు కూడా  జోడి గా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.  ఆ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా లో కూడా కనిపించి, టాలీవుడ్ మెచ్చిన జోడి గా ఎదిగారు..

నాగార్జున - రమ్యకృష్ణ :
అభిమానులను వెండితెరకు కట్టిపడేసేలా ఈ జంట ఉంటుంది. వీరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా కుదిరేది. వీరు నటించిన సినిమాలు హలో బ్రదర్, ఘరానా బుల్లోడు,అన్నమయ్య వంటి అనేక సినిమాలతో పాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు..


రాజేంద్రప్రసాద్ -  ఆమని :
వీళ్ళ జోడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1993లో బాపు దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో వీరిద్దరూ నటించి కట్టిపడేసారు.  మిస్టర్ పెళ్ళాం సినిమా ద్వారా బాగా పాపులారిటీని అందుకున్న ఈ జోడీ,ఆ తర్వాత ఆ నలుగురు సినిమాలో కూడా అలరించింది.


అంతే కాకుండా నాగార్జున -  శ్రేయ ల జోడి, మోహన్ బాబు, మీనా, రమ్య కృష్ణ లజోడి, అలాగే  నరేష్ సితారాల జోడీ, మహేష్ బాబు-  సమంత ల  జోడీ అలాగే ఎన్టీఆర్  - సమంతల జోడీ లు కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: