ఆమె బాలనటిగా రికార్డు సృష్టించారు. ఒకనాడు ఆమె లేని సినిమావే లేదు. ఇక ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ చిన్నప్పటి రోల్స్ వేశారు. అలాగే బాలనటిగా తన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక పెద్ద అయ్యాక ఆమెకు వచ్చిన పాత్రలు అన్నీ చెల్లెలు రోల్స్ మాత్రమే.

ఆ విధంగా ఒక టైమ్ లో చెల్లెలు అంటే వరలక్ష్మి అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అక్కినేని  నాగేశ్వరరావు హీరోగా బాపూ డైరెక్షన్ లోవచ్చిన అందాల రాముడు మూవీలో ఎదగడానికి ఎందుకురా తొందరా అన్న పాటలో తొలిసారిగా బాలనటిగా వరలక్ష్మి మెరిసింది. ఇక జీవనజ్యోతిలో మొత్తం కధకు కేంద్ర బిందువు అయ్యే పాత్రలో మంచి మార్కులు కొట్టేసింది. అన్నింటికంటే చెప్పాల్సిన విషయం ఏంటి అంటే శంకరాభరణంలో శంకరశాస్త్రి కుమార్తెగా చిన్నప్పటి పాత్రలో ఆమె నటించిన తీరు అద్భుతం.

ఇక చెల్లెలు పాత్రలకు వరలక్ష్మి పెట్టింది పేరుగా చెప్పాలి. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ తాను ఎక్కువగా సినిమాల్లో చిరంజీవి, క్రిష్ణలకు చెల్లెలుగా నటించాను అని చెప్పింది. ఇక 1990 తరువాత తెలుగు సినిమా హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో తాను టీవీ సీరియల్స్ కి పరిమితం అయ్యాయని కూడా తెలిపింది. ఇక వరలక్ష్మి ఇపుడు మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటోందిట. అయితే తెలుగులో ఆమె అభిమాన నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్. ఈ ఇద్దరి సినిమాల్లో నటిస్తాను అంటోంది. అంతేకాదు, వీరికి అందమైన అమ్మగా కనిపించాలన్నది తన కోరికగా  చెబుతోంది. మరి చెల్లెలు అంటే తానే అన్న బ్రాండ్ ఇమేజి ని సాధించిన వరలక్ష్మి అమ్మ పాత్రల్లో కూడా అలరించాలని కోరుకుందాం. ఇదిలా ఉంటే ఆమె టీవీ సీరియల్స్ లో కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. వాటిలో కూడా అమ్మ పాత్రలలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ హుషార్ గా ఉన్న వరలక్ష్మి కి కనుక అవకాశాలు ఇస్తే అచ్చ తెలుగు అమ్మను వెండి తెర మీద చూసే అవకాశం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: