కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014 సంవత్సరంలో ఫుగ్లి సినిమాతో కియారా నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు. రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా కియారా అద్వానీ నటించారు. మహేష్ తో కియారా నటించిన సినిమా హిట్ కాగా రామ్ చరణ్ తో ఆమె కలిసి నటించిన సినిమా మాత్రం ఫ్లాప్ కావడం గమనార్హం.తన హాట్ హాట్ హావాభావాలతో యూత్ ని ఫిదా చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న కియారా అద్వానీ.బాలీవుడ్ లో స్టార్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు  ఎంట్రీ ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పేర్లు మార్చుకుంటారనే విషయం తెలిసిందే.



కొందరు లక్ కోసం పేరు మార్చుకుంటే మరికొందరు మాత్రం అదే పేరుతో పాపులర్ అయిన సెలబ్రిటీ ఉన్నా లేక పేరు బాలేకపోయినా పేరు మార్చుకోవడం జరుగుతోంది.ఇక మన హాట్ బ్యూటీ కియారా అద్వానీ అసలు పేరు అది అది కాదట. కియారా అసలు పేరు అలియా అద్వానీ.అయితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్లే కియారా అద్వానీ పేరును మార్చుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కియారా ఈ విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ లో అప్పటికే అలియా భట్ ఉండటంతో పేరు మార్చుకున్నానని కియారా  చెప్పింది.తన పేరుతో మరో హీరోయిన్ పేరు ఉండటంతో సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని సూచించారని ఆమె చెప్పారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్ల పేర్లు ఉండకూడదని సల్మాన్ ఖాన్ చెప్పారని ఈ హాట్ బ్యూటీ చెప్పింది.సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని చెప్పడంతో అలియా అద్వానీ పేరు కియారా అద్వానీగా మారింది. ఇక ప్రస్తుతం హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన ముద్ర వేసుకుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: