ఉదయ్ కిరణ్ రెండో సినిమా నువ్వు నేను, మూడో సినిమా మనసంతా నువ్వే కు కూడా సంగీతం అందించి ఆ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేశాడు. సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్ ఎంతో ఆసక్తిగా మారింది ప్రేక్షకులకు. ఆ తరువాత శ్రీరామ్, హోలీ, నీ నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా వంటి సినిమాలకు సంగీతం అందించారు ఆర్.పి.పట్నాయక్. ప్రతి సినిమాలో ఆర్ పి పట్నాయక్ తనదైన సిగ్నేచర్ ని మెయింటైన్ చేస్తూ ఒక్క పాటైనా హిట్టయ్యేలా చూసుకున్నాడు. అలా వీరిద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లోనే ది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచిపోయింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినిమాలు చేయడంలో వెనకబడటం, ఆర్పీ కూడా సంగీతం తగ్గించి నటుడుగా రాణించాలని వెళ్లిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ కు తెరపడింది. కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని రోజులు గుర్తుంచుకునే పాటలను ఈ కాంబినేషన్ అందించింది. ఎన్నో ప్రేమ గీతాలను, యుగళ గీతాలను ఆర్పీ సంగీతం నుంచి రాగా ఉదయ్ కిరణ్ ఆ బాణీలకు తగ్గట్టుగా డాన్సులు అభినయాన్ని ప్రదర్శించి మంచి హీరోగా ఎదిగినా ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇప్పటికీ ఆయన అభిమానులు కలిచి వేస్తుంది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ ఈ సినిమా ఇంత వరకు రిలీజ్ కు నోచుకోలేదు. ఆర్పి పట్నాయక్ ప్రస్తుతం హీరోగా, నటుడిగా కొనసాగుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి