నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు త్వరలో ఐదవ సీజన్ కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఆ సీజన్ కు కావాల్సిన కంటెస్టంట్స్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. సీజన్ 5 త్వరలో మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వారంతా వారి కెరియర్ లో ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత మాత్రం రాణించలేకపోతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 1 శివబాలాజి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ వల్ల తనకు మంచి అవకాశాలు వస్తాయని భావించగా దాని వల్ల ఒరిగింది ఏమి లేదని అర్ధమైంది. సెకండ్ సీజన్ కౌశల్ మందా విన్నర్ గా నిలిచాడు. కౌశల్ ఆర్మీ అంటూ ఓ అభిమాన సంఘాలే ఏర్పడ్డాయి. కాని బయటకు వచ్చాక అంతా చల్లబడ్డారు. ఇక సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ వచ్చాడు. కాస్త కూస్తో సింగర్ గా అతను తన పాపులారిటీని కొనసాగిస్తున్నాడు.

సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్ కూడా ఏదో చేస్తాడని అనుకున్నారు. కాని సీజన్ ముగిసి ఏడాది కావొస్తున్నా సరే తన నెక్స్ట్ సినిమా కన్ ఫర్మ్ చేయలేదు. అభిజీత్ కు సినిమా ఆఫర్లు వస్తున్నా అతనే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇంకో సీజన్ మొదలైతే అభిజీత్ ను బిగ్ బాస్ విన్నర్ అనే విషయం మర్చిపోతారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినా కెరియర్ లో మాత్రం ఫెయిల్యూర్స్ గా మిగులుతున్నారు.  అభిజీత్ అయినా ఆ సెంటిమెంట్ మారుస్తాడని అనుకుంటే సినిమాలు లేట్ చేస్తున్నాడు. మరి అభిజీత్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. అయితే అభిజీత్ ఫ్యాన్స్ మాత్రం అతని ప్రతి అప్డేట్ ను ఫాలో అవుతున్నారు. అతను చేసే సినిమా కోసం అతని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: