ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా ఏ సినిమా ఇండస్ట్రీ అయినా తేలిపోవాల్సిందే. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ గా పేరున్న బాలీవుడ్ టాలీవుడ్ సినిమాల జోరు ఏమాత్రం తట్టుకోలేకపోతుంది అని చెప్ప వచ్చు.  ఈ రెండు ఇండస్ట్రీలను పోలిస్తే భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న  సినిమా, రామ్ చరణ్ శంకర్ సినిమా ఇంకా చాలానే బాలీవుడ్ నీ తలదన్నే సినిమాలే.

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్  అన్నట్లుగా ప్రపంచమంతా చూసేది. దేశంలో అత్యధిక రాష్ట్రాలలో జనాలు మాట్లాడే హిందీ భాషలో సినిమాలు తీస్తూ పెద్ద మార్కెట్ ను కలిగి ఉన్న బాలీవుడ్ ముందు ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసి ఒక్క రాష్ట్రానికి పరిమితమైన టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం చిన్నవిగానే కనిపించేవి. కానీ సౌత్ ప్రేక్షకుల సినిమా అభిమానం ముందు హిందీ వారి ప్రేమ చిన్నది అని ఇప్పుడు తెలుస్తోంది. తెలుగుతో పాటు సౌత్ సినిమాలకు వస్తున్న బిజినెస్ ఆఫర్లు వాటి ఢీల్స్ చూస్తే బాలీవుడ్ కి కళ్ళు తిరిగి పోతున్నాయట.

డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే 350 కోట్ల దాకా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా బిజినెస్ సాధించగా థియరిటికల్ రైట్స్ మరియు ఇతర బిజినెస్ లను కూడా కలిపితే వెయ్యి కోట్లను చేరేలా ఉన్నాయట. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా రెండు వందల కోట్లకు పైగానే పడుతున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ పార్ట్ 2 కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతుందట. ఈ సినిమాల కు ముందు బాలీవుడ్ సినిమాలు అసలు నిలిచే పరిస్థితి లేదు. అక్కడి సూపర్ స్టార్ హీరోల సినిమాలకు కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే సగం బిజినెస్ జరగడం కష్టంగా ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: