
కేవలం ఒక్క ఫోన్ కాల్ వాయిస్ ద్వారా ఆయన తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇక అలాగే తను సినిమాల్లో నటిస్తూనే, "శ్రీదేవి డ్రామా కంపెనీ" షో లో ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో "గౌతమ్ రాజ్" అనే ఫ్రెండ్ గురించి పృథ్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.
కానీ ఆ వాక్యాలు నటుడు గౌతమ్ రాజును ఉద్దేశించి అనినవి కాదంటూ, సినీ ఇండస్ట్రీలో అందరూ అనుకుంటుండగా.. దానిపై పృథ్వీరాజు ఈ కామెంట్ చేశారు. ఇది కేవలం నా స్నేహితుడి గురించి మాత్రమే అని తెలిపారు. కానీ ఇలా నన్ను మధ్యలో అనవసరంగా దూరుస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సినీ నటుడు గౌతమ్ రాజు, నేను మంచి స్నేహితులం అని మా ఇద్దరి మధ్య ఇలాంటి తగాదాలు పెట్టవద్దని ఒక వీడియో ద్వారా తెలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ చిన్న విషయం జరిగినా, పెద్ద ఇష్యూ చేయడం గమనిస్తున్న విషయం. పృథ్వి రాజు కూడా ఏమీ అనకపోయినా, గౌతంరాజును ఏదో అన్నాడు అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గౌతంరాజు నుద్దేశించి ఏమీ అనలేదని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.