తెలుగు సినిమా పరిశ్రమలో ఫేడ్ అవుట్ హీరోల రీ ఎంట్రీ సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం వారు చేసే సినిమాలు చూస్తుంటే. గతంలో హీరోలుగా కొంతకాలం వరకు ప్రయాణించి మంచి సినిమా లు చేసి ఆ తర్వాత వివిధ కారణాల వల్ల తెలుగు తెరకు దూరమైన వారు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ విధంగా ఇండస్ట్రీకి దూరమైన వారంతా ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమవుతున్నారు. అలా రీ ఎంట్రీ ఇస్తున్న మన హీరో లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిరునవ్వుతో హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు హీరో వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత కాలంలో హీరో గా సరైన సినిమా లు చేయకపోవడంతో సెకండ్ హీరోగా పాత్రలు చేశారు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేయడం మొదలుపెట్టారు. ఆ పాత్రలు కూడా ఎక్కువగా రాకపోవడంతో మొత్తానికి ఫేడ్ అవుట్ అయిపోయారు. తాజాగా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు మొగ్గుచూపుతున్నారు మరొక హీరో సుమంత్. 

అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చి సత్యం గోదావరి వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని హీరోగా నిలబడలేక పరిశ్రమ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత చాలా రోజులకు మళ్లీ రావా సినిమా హిట్ అయినప్పటికీ తగిన కథలు ఎంపిక చేసుకో లేక పోవడంతో మళ్లీ ఫ్లాప్ ల బాట పట్టారు. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అయితే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ త్రి భాష చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈయన. పెళ్లి సినిమాతో హీరోగా హిట్ అందుకున్న వడ్డే నవీన్ కూడా  ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరే కాకుండా 1990,2000 దశకాలలో హీరోగా ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయినా నటులు చాలామంది ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: