రాజమౌళి ఒక బ్రాండ్ ఒక దక్షిణాది దర్శకుడుకి దేశవ్యాప్తంగా ఇమేజ్ రావడం సాధారణమైన విషయం కాదు. అయితే అలాంటి గౌరవాన్ని రాజమౌళి దక్కించుకున్నాడు. కానీ అలాంటి రాజమౌళి బ్రాండ్ మసకబారుతోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న అర్థంకాని వ్యూహాలు.


ఈసినిమా ఇప్పటికే మూడుసార్లు రకరకాల కారణాలతో వాయిదా పడింది. చివరిగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినా ఎప్పుడు ఈమూవీ రిలీజ్ అవుతుందో ప్రస్తుతాతానికి రాజమౌళికి కూడ క్లారిటీ లేదు అని అంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ప్రేక్షకులు ధియేటర్లకు రావడం లేదు అన్న కారణంతో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలను వాయిదా వేసారు.


పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ప్రస్తుత పరిస్థితులలో వస్తారని చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు రారు అన్న నమ్మకాన్ని ‘లవ్ స్టోరీ’ సక్సస్ బ్రేక్ చేసింది. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ కేవలం సాయి పల్లవి కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు వస్తున్నామని ఓపెన్ గానే చెపుతున్నారు. కేవలం సాయి పల్లవి ఇమేజ్ కి ఆస్థాయిలో ప్రేక్షకులు వస్తుంటే రాజమౌళి లాంటి నేషనల్ బ్రాండింగ్ ఉన్న వ్యక్తి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా జనం వచ్చి తీరుతారు. అయితే రాజమౌళికి మాత్రం ధైర్యం చాలడంలేదు.


దీనితో మనసులో సంక్రాంతికి రావాలి అని ఉన్నా తన ఆలోచనలు గ్రహించి మహేష్ ప్రభాస్ పవన్ లు సహకరించరు అన్న సందేహం రాజామౌళికి ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి సినిమా విడుదల అవుతుంది అంటే భయపడే ఇండస్ట్రీ వర్గాలు ఈసారి సంక్రాంతి సినిమాల విషయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఎటువంటి రాజీపడకూడదు అని స్థిరనిర్ణయంతో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఒకవైపు సమ్మర్ రేస్ కు విడుదల కాబోయే సినిమాల డేట్స్ అన్నీ వస్తున్నా ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి ఆడుతున్న దాగుడుమూతలు ఎవరికీ అర్థంకాడంలేదు..  




మరింత సమాచారం తెలుసుకోండి: